చెప్పులు పోయాయంటూ పోలీసుల‌కు ఫిర్యాదు.. దర్యాప్తు మొదలెట్టిన పూణే పోలీసులు!

  • చెప్పుల విలువ రూ. 425
  • విచార‌ణ చేప‌ట్టిన పూణె పోలీసులు
  • ఐపీసీ సెక్ష‌న్ 379 ప్ర‌కారం కేసు న‌మోదు
పూణేలోని ఖేద్ పోలీసులు ఇప్పుడు వార్తల్లోకి ఎక్కారు. ఎందుకంటే, తన చెప్పులు పోయాయ‌ని ఒక వ్య‌క్తి ఇచ్చిన ఫిర్యాదును సీరియ‌స్‌గా తీసుకుని దాని మీద విచార‌ణ కూడా మొద‌లు పెట్టారు. ఖేద్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో ఉన్న ర‌క్షేవాడి ప్రాంతానికి చెందిన విశాల్ కాలేక‌ర్ రూ.425 విలువ చేసే త‌న కొత్త శాండిల్స్‌ను ఎవ‌రో కొట్టేశార‌ని అక్టోబ‌ర్ 3న‌ ఫిర్యాదు చేశాడు.

ఈ ఫిర్యాదును ఐపీసీ సెక్ష‌న్ 379 ప్ర‌కారం రిజిస్ట‌ర్ చేసుకున్న‌ట్లు పోలీసులు తెలిపారు. దీని గురించి విచార‌ణ చేప‌డుతున్నామ‌ని, ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రినీ అరెస్టు చేయ‌లేద‌ని ఇన్‌స్పెక్ట‌ర్ ప్ర‌దీప్ జాద‌వ్ తెలిపారు.
Go Back to Shorts
sandals
pune
complaint
probe ordered
rakshewadi
khed

More Telugu News